Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- బీఆర్ఎస్లో చేరిన ఆర్యవైశ్య నాయకులు
నవతెలంగాణ-మీర్పేట్
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు తెరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన వాసవిదేవి దేవాలయ భూమి పూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సుమారు 300మంది ఆర్యవైశ్య సంఘం నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల, మత బేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. చాలామంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయరు కానీ కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్న వారికి అండగా ఉండాలని కోరారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య, స్థానిక కార్పొరేటర్లు, కోఅప్షన్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.