Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు : సామ రంగారెడ్డి
నవతెలంగాణ -ఎల్బీనగర్
ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్స్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని రంగా రెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవన్నారు. గదులు శుభ్రం చేయడానికి స్వీపర్స్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. లింగోజిగూడ డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్వచ్చ్ ఎల్.బి నగర్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని కారిడార్, మెట్ల స్కూల్ సభ వేదిక ఊడ్చి శుభ్రపరిచారు. అనంతరం సామ రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో గదులు శుభ్రం చేయడానికి స్విపర్స్ లేరన్నారు. లింగోజీగుడలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 1000కి పైచిలుకు విద్యార్థులున్నారన్నారు. 22 తరగతి గదులున్న పాఠశాలను ఊడ్చే స్వీపర్లు లేరన్నారు. సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశానికి ఈ విద్యార్థులు దిక్సూచులని, అలాంటి వారికి ఉన్నత విద్యని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కానీ ఆ బాధ్యతను విస్మరించిందని అన్నారు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందించక వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిబ్బంది కొరత, ప్రభుత్వ పాఠశాలలో వున్నా సమస్యను స్థానిక ఎమ్మెల్యే ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పాఠశాలలో స్వీపర్లు లేక పాఠశాల తరగతి గదులు, కారిడార్, మెట్లు ఇసుకతో నిండిపోయిందన్నారు. డీఈఓ వెంటనే ఆ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో విజరు భాస్కర్, కృష్ణంరాజు, భోస్లే శ్రీనివాస్, కాకి గంగాధర్ గౌడ్, నాగరాజు ప్రవీణ్‌రెడ్డి, ప్రవీణ్‌గౌడ్, హరి ప్రసాద్, జగదీష్ గట్టు రవి, భరత్, గణేష్ పాల్గొన్నారు.