Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ చర్యలతో మారనున్న రాజకీయ సమీకరణాలు
- బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లలోనూ తీవ్ర వ్యతిరేకత?
- పార్టీ మారటమే మేయర్ పదవికి గండమంటున్న రాజకీయ పరిశీలకులు
నవతెలంగాణ-బడంగ్ పేట్
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికై మూడేండ్లు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు పాలకవర్గం పార్టీలకు అతీతంగా డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కారిస్తూ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పనిచేశారు. 2019 నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పాలకవర్గం మూడేండ్ల కాలం పూర్తి అయిన తరువాత అవిశ్వాస తీర్మానం పెట్టేు అవకాశముంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని వివిధ రాజకీయ పార్టీల సమీకరణాలు మారిపోయే అవకాశముందని పలు రాజకీయ పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 32డివిజన్లున్నాయి. అందులో గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 14, బీజేపీ 10, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలుపొందగా ఒక డివిజన్లో ప్రస్తుత డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అనాడు మేయర్ పదవి కోసం 17మంది కార్పొరేటర్లు ఉంటేనే నూతన పాలక వర్గం ఏర్పాటు చేసేందుకు అవకాశం. కానీ అధికార బీఆర్ఎస్కు సరైన మెజార్టీ సభ్యులు లేకపోవటంతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో 31వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, 20, 23వ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్‌రెడ్డిలను అధికార పార్టీలో చేర్చుకొని పారిజాత నర్సింహారెడ్డికి మేయర్ పదవి, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఇబ్రం శేఖర్‌కు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టారు. ప్రతిపాక్ష హౌదాలో 10మంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు.
పార్టీ మారటమే మేయర్ పదవికి గండం
అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారటంతోనే మేయర్ పదవికి గండం ఏర్పడిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎలాగైనా మేయర్ పదవికి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. తమ పార్టీ 10మంది కార్పొరేటర్లతోపాటు అధికార బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మేయర్ పదవి దక్కించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరి ఈ అవిశ్వాస తీర్మానం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.