Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ - మీర్పేట్
పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలని రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్లో ఉన్న అధిక ఇంటి పన్నులు తగ్గించాలని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ మైత్రీపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడాలేని విధంగా మీర్పేట్ కార్పొరేషన్లో ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. పక్కనున్న జీఎచ్ఎంసీలో సైతం ఇంతగా ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు లేవన్నారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేనివిధంగా మీర్పేట్ కార్పొరేషన్లో అధిక పన్నులు వసూలు చేస్తున్నారని, దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికంగా ఉన్న ఇంటి పన్నులను తగ్గిస్తామని గతంలో స్థానిక మంత్రి చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ విషయం మర్చిపోయారని విమర్శించారు. పన్నులు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్లు చల్లా కవితా బాల్‌రెడ్డి, సిద్దాల మౌనిక శ్రీశైలం, కాలనీ అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి వెంకటేష్, నర్సింహ్మరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.