Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్టీ ఎస్చైర్మెన్ పాటిమీది జగన్మోహన్ రావు
నవతెలంగాణ-కూకట్పల్లి
ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత పోస్ట్‌లు పెడుతూ ముఖ్యమంత్రి ని అవమానపరుస్తున్న అకౌంట్లను బ్లాక్ చేయాలని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో జగన్ మోహన్‌రావు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించే బీజేపీి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 18 ఫేస్బుక్ పేజెస్, 24 ట్విట్టర్ హ్యాండిల్స్, 4 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల పూర్తి వివరాలతో 24 పేజీల ఫిర్యాదుని కూకట్పల్లి పోలీస్ స్టేషన్, ఎస్హెచ్ఓ నర్సింగ్‌రావుకు శనివారం టీఎస్టీఎస్ చైర్మెన్ పాటిమీది జగన్మోహన్రావు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ని ఉల్లంఘించిన ఈ అకౌంట్లని వెంటనే బ్లాక్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ అకౌంట్లపై సమగ్రమైన దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది.