Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్‌స్టిట్యూట్ అఫ్ ఫార్మసీ కళాశాలలో క్లబ్ 64 ఆధ్వర్యంలో శనివారం ట్రెడిషనల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, ఫౌండర్ సెక్రెటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, చైర్మెన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ట్రెడిషనల్ డే ఈవెంట్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మ, రంగోలి, దాండియా, వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు వివిధ రకాల సంప్రదాయ దుస్తులు ధరించి, ర్యాంప్ వాక్, డాన్సులతో, డీజే స్టెప్పులతో కార్యక్రమాన్ని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాక్ బ్యాండ్, ఎడ్లబండి, బోనాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.