Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి శనివారం 1కోటి 10లక్షల రూపాయలతో కూకట్పల్లి డివిజన్లో పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలోని అన్ని డివిజన్లలో పెండింగ్లో ఉన్న పనులకు శంకుస్థాపన చేస్తున్నామని, ఇవి పూర్తయితే దాదాపు 99శాతం పనులు పూర్తయినట్లేనని, ఇంకా ఎక్కడైనా అరకొర పనులు మిగిలి ఉంటే అవి కూడా త్వరలోనే పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే కూకట్పల్లి నియోజకవర్గంలోని తొమ్మిది చెరువుల అభివద్ధి దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఇందులో భాగంగానే ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల మురుగునీరుతో ఉత్పత్తయ్యే దోమల ఇబ్బంది మరియు కలుషిత జలాలు చెరువుల్లో కలవకుండా జరుగుతుందని చెప్పారు. భవిష్యత్లో మంచినీటి ఎద్దడి కూడా లేకుండా, ఇప్పటికే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణాలతో నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని, పార్కులు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడా ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంతోష్ జీహెచ్ఎంసి అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.