Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.5 లక్షల విలువ గల 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నవతెలంగాణ-హయత్‌నగర్
ద్విచక్ర వాహనాలు చోరీలు చేస్తున్న వ్యక్తిని ఎల్బీనగర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఎల్బీనగర్లో ఉన్న డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాయిశ్రీ నిందితుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. నంద్యాల, కర్నూలు జిల్లాకు చెందిన గడ్డం హుస్సేన్ రెడ్డి వృత్తి రీత్యా హైడ్రాలిక్ క్రేన్ డ్రైవర్‌గా పనిచేస్తూ సెకండ్ హాండ్ వాహనాలు విక్రయాలు చేసేవాడు. సంపాదన సరిపోక అధిక డబ్బులు కోసం తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాలను గమనించి వాటిని అపహరించుకుపోయేవాడు.
ఈనెల 23న ఎల్బీనగర్లో ఉన్న కామినేని హాస్పిటల్ వద్ద ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం ఆపి ఉండటం గమనించి అట్టి వాహనాన్ని అపహరించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎల్బీనగర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని సాగర్ రింగ్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని అతని విచారించగా, అతని వద్ద నుంచి 5లక్షల రూపాయల విలువగల 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గద్వాల్ ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జైల్‌కు వెళ్లివచ్చాడు. అతనిపై ఎల్బీనగర్లో రెండు, ఉప్పల్‌లో నాలుగు, చైతన్యపురి, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధులలో కేసులు నమోదయ్యాయి. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్టీ ఇన్స్పెక్టర్ సుధాకర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్‌రావు, ఎస్ఐ నరేందర్, సిబ్బంది జంగయ్య, బిక్షం, యాదగిరి, శ్రీనివాస్, జంగయ్య, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.