Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్ పల్లిలోని సంఘమిత్ర డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే కూకట్ పల్లి నైనా గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. విద్యార్థు లు సాంస్కతిక కార్యక్రమాలు, తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు హాజరై మాట్లాడారు. విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. ఇంగ్లాండ్ 200 ఏండ్లు ప్రపంచంలో అగ్రగామిగా ఉంటే, అమెరికా 75 ఏండ్లు అగ్రగామిగా కొనసాగిందనీ, భారతదేశం సుమారు 1000 ఏండ్లు అగ్రగామిగా కొనసాగిందని తెలిపారు. ఉన్నత విద్య కోసం మంచి యూనివర్సిటీలలో విద్యార్థులు ఎన్నుకోవాలనీ, ఏ యూనివర్సిటీకి అయినా యూజీసీ రికగ్నిషన్ ఉండాలన్నారు. యుజిసీ గుర్తింపు లేని యూనివర్సిటీలు చాలా వచ్చాయనీ, అలాంటి విశ్వవిద్యా లయంలో చదివిన విద్యార్థులకు తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందనీ, ఆ యూనివర్సిటీ డిగ్రీ ఇతర దేశాలు గుర్తించవనీ, ఈ విషయం గ్రహించాలని సూచించారు. చైర్మన్ డాక్టర్ కొరదాల నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనీ, ఉన్నత పదవులకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ కెవి లావణ్య, డీన్ మౌనిక, డైరెక్టర్ హరికృష్ణ, ప్రిన్సిపాల్ మీరావలి, వైస్ ప్రిన్సిపౄల్ నరేష్ లావన్య, తదితరులు పాల్గొన్నారు.