Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని, సోమవారం బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉట్ల చంద్రారెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి, కోశాధికారి నర్సింలు ముదిరాజ్, ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం రాజిరెడ్డి, అధ్యక్షుడు ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, అనంత రాములు, కె.వి.రాజు, తాటి కిరణ్, బీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కనకా రెడ్డి సాంబశివుడు, నర్సిరెడ్డి, ప్రేమ్ కుమార్, ముత్యం వెంకట్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శరత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శేఖర్ రెడ్డి, ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అల్విన్ కాలనీలో..
మహాత్మా గాంధీ 74వ వర్దంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షు లు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, రాములుగౌడ్, మౌలానా, ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర రావు, పుట్టం దేవి, కరుణాకర్, నాగభూషణం, కూర్మయ్య, ఇంతి యాజ్, రవీందర్, దనుంజరు, వెంకటేష్, సంపత్ పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట : గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం వచ్చినప్పుడే శాంతి సమాజం నెలకొంటుందని బాపూజీ హైస్కూల్ చైర్మన్ కరస్పాండెంట్ నవ్వ ప్రభాకర్ రావు అన్నారు. సోమవారం గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వర నగర్‌లోని బాపూజీ హైస్కూల్లో గల గాంధీజీ విగ్రహానికి విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద..
మహాత్మా గాంధీ గొప్ప మహనీయులు అని కుత్బుల్లాపూర్ మండల సీపీఐ కార్యదర్శి ఈ.ఉమామహేష్ అన్నారు. సోమవారం గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట చివరి బస్ స్టాప్‌లో గల గాంధీజీ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు ప్రవీణ్ ఆకుబత్తిని, ఏఐటీయూసీ అధ్యక్షులు ఉజ్జిని హరినాథ్‌రావు, నాయ కులు చర్లపల్లి రాములు, వంగాల శ్రీనివాస్, సీపీఐ గుట్ట శాఖ కార్యదర్శి సహదేవ్‌రెడ్డి, నాయకులు కొమురయ్య శివ పాల్గొన్నారు.
రంగారెడ్డి డివిజన్ పరిధిలో..
మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని గాంధీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్దా రాఘవులు అన్నారు. సోమవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి డివిజన్ పరిధి గాంధీనగర్ గాంధీ గ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఖాజా మియా, చింతయ్య, అబ్దుల్ ఖాదర్, జల్ద లక్ష్మినాథ్, నరసింహులు, పెద్ద తిమ్మయ్య, రాములు, వాజీద్, శ్రీనివాస్, సాయి గౌడ్, బిక్షపతి, తిమ్మయ్య, విజరు, పర్వతాలు, జగన్, దత్తు గౌడ్, శ్రీను, రాంచందర్, మురళి, రాందాస్, సందీప్, సాయి పాల్గొన్నారు.
బాలానగర్ : చింతల్ పరిధిలోని హెచ్ఎంటీ గ్రౌండ్స్‌లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా బాపు స్మారక కార్యక్రమంలో భాగంగా ఇందిరాగాంధీ స్మారక మండల స్థాయి ఎన్ఎస్యుఐ స్కూల్ స్పోర్ట్స్ మీట్ -2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, తెలంగాణ రాష్ట్ర స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కుత్బుల్లాపూర్ కోశాధికారి కె.నర్సిరెడ్డి తదితర అతిధులు వివిధ స్కూల్ కరెస్పాండెంట్స్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్, రాష్ట్ర కార్యదర్శులు పథ్వీ రాజ్, రాకేష్ ముధిరాజ్ మరియు మేడ్చల్ జిల్లా కార్యదర్శులు సాయి కిరణ్, అనూప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం మేడ్చల్ మండల వ్యాప్తంగా ఆయనకు పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు నివాళులు అర్పించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ వి.రాములు, కౌన్సిలర్లు దొడ్ల మల్లిఖార్జున్ ముదిరాజ్, బేరి బాలరాజు, అమరం హేమంత్ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అమరం మోహన్ రెడ్డి, మేనేజర్ కిరణ్, నర్సింహ రెడ్డి, రజిత, హరికృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎంపీడీవో జె.పద్మావతి, ఎంపివో వినూత్నరెడ్డి, రాజబొల్లారం తాండ సర్పంచ్ మంగ్య నాయక్, మండల కార్యాలయ సిబ్బంది పాల్గొని పుష్పాంజలి ఘటించారు.