Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్ననగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి, అభినదించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కమల ప్రసన్న నగర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాననీ, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయనీ, ఏ చిన్న సమస్య తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. నూత నంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికీ ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యలపై స్పందిస్తూ, ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని సూచించారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాననీ, మౌలిక వసతు ల కల్పనకు పెద్ద పీట వేస్తాననీ, కమల ప్రసన్న నగర్ కాలనీ అసోసియేషన్ భాగస్వామ్యం తో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాఘవులు, కమల ప్రసన్న నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు తిరుపతి, జనరల్ సెక్రెటరీ శ్రీశైలం, జాయింట్ సెక్రెటరీ బండప్ప, ట్రెజరర్ శివ శంకర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేష్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.