Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- బన్సీలాల్పేటలో అభివృద్ధి పనులు ప్రారంభం
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిం చారు. సోమవారం బన్సీలాల్ పేట డివిజన్ లో రూ.46.5 లక్షలతో నిర్మించనున్న కమ్యునిటీ హాల్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ ప్రాంత ంలో రాత్రివేళల్లో ఇండ్ల మధ్యలో, ఖాళీ స్థలాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్నారనీ, తాము బయటకు వెళ్ళాలంటే భయంగా ఉందని స్థానిక మహిళలు మంత్రికి విన్నవించా రు. స్పందించిన మంత్రి వెంటనే అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలనీ, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గాంధీనగర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించా రు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు డ్రయినేజీ, తాగునీటి సమస్య ఉన్నదని మంత్రికి విన్నవించగా, వెంటనే డ్రయినేజీ, వాటర్ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలనీ, తదనంతరం రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బన్సీలాల్ పేట సేవా సంఘం కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లా డుతూ కాలనీలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడిం చారు. బన్సీలాల్ పేట సేవాసంఘం కార్యాలయం వెనుక ఉన్న మట్టి ఇతర నిర్మాణ వ్యర్ధాలను వెంటనే తొలగించి ఆ స్థలాన్ని కూడా కాలనీ ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించా రు. కాలనీ విద్యార్ధులు, నిరుద్యోగ యువత కోసం ఈ భవనంలో ఈ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటిం చారు. కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని వారం రోజుల్లో ఇక్కడే ఏర్పాటు చేస్తామనీ, కాలనీ ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కాలనీల అభివృద్ధి లో స్థానిక యువత కీలక బాధ్యత వహించాలన్నారు. ప్రభు త్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి కాలనీ లోని అనేకమందికి తెలియకపోవడం వల్ల వినియోగించు కోలేకపోతున్నారని తెలిపారు. యువత వారికి అండగా ఉండి పథకాలను ఏ విధంగా పొందాలో వివరించి వారికి మేలు జరిగే విధంగా కృషి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని లబ్దిపొం దాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, ముకుంద రెడ్డి, సుదర్శన్, ఎలెక్ట్రికల్ కృష్ణ, తహసిల్దార్ శైలజ, వాటర్వర్క్స్ రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ క్రిస్టోఫర్, నాయకులు రాజు, లక్ష్మీపతి, ప్రేం, కుమార్ యాదవ్, మోహన్ రావు, రంగారావు, నర్సింగరావు, చాంద్, కళ్యాణ్, సుధాకర్, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.