Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
కోడ్ ఆక్యూటీ కంపెనీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెేటీఆర్ సోమవారం బేగంపేటలోని క్యూన్స్ ప్లాజాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశం, అమెరికాలో పని చేస్తున్నట్టు తెలిపారు. ఇది కృత్రిమ మేధస్సు, స్టాఫింగ్, మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్, ఇతర అంశాలపై దృష్టి పెడుతుందని తెలిపారు. యువత రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనీ, ఇలాంటి సంస్థల స్థాపించి దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నా రు. ఈ రంగంలో ముందుకెళ్లే యువతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఎమ్మె ల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేటీఆర్ ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఐటీ పరిశ్రమ హైదరాబాద్లో ముందు వరుసలో ఉందన్నారు. యువత రాష్ట్ర ప్రభుత్వం అందించే ఐటీ రంగ ప్రోత్సాహకాలు అందుకుని ఈ రంగం అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జైయేష్ రంజన్, ఐటీ డైరెక్టర్ కొనతం దిలీప్, కోడ్ ఆక్యూటీ సీఈవో అనుదీప్ కాటన్ గోరి, చీప్ ఆపరేషన్ ఆఫీసర్ రాజీవ్ పోరండ్ల, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శివదీప్ కాటన్ గురి, చీప్ స్టాప్ రాజశేఖర్, అభిషేక్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షు లు అందగట్ల స్వామి, ఎల్.కార్తీక్, గుండేటి శ్రీధర్, వినరు, తెలంగాణ పద్మశాలి మహిళా విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పోరండ్ల శారద, గుంటక రూప, చిలువేరు సునీత, తదితరులు పాల్గొన్నారు.