Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
పటేల్ కుంట చెరువులోని గుర్రపు డెక్క తొలగింపు పనులను నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ప్రారంభించారు. కొద్ది రోజులుగా నాచారంలో విపరీ తంగా దోమలు పెరిగాయనీ, దీనికి ప్రధాన కారణం పటేల్ కుంట చెరువులోని గుర్రపు డెక్క ఈ గుర్రపు డెక్క తొలగించడానికి పలుమార్లు టెండర్లు పెట్టిన ఎవరూ రాకపోవడంతో ఆలస్యంగా పనులను ప్రారంభించారు. పది రోజుల్లో గుర్రపు డెక్కను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో పటేల్ కుంట చెరువులోకి గుర్రపు డెక్క రాకుండా పెరగకుండా మురుగునీటిని చెరువులోకి చేరకుండా ప్రత్యేకమైన 1200 పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయనీ, పూర్తయిన వెంటనే చెరువులోకి నీరు చేరకుండా పైప్లైన్ ద్వారా చెరువు బయటకి పంపియను న్నామని తెలిపారు. ఆ తర్వాత చెరువులో ఉన్న పూడిక తొలగించి కేవలం ఎస్టిపి ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే, అలాగే వర్షపు నీటిని మాత్రమే చెరువులోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోనున్నామని కార్పొరేటర్ తెలిపా రు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మేకల ముత్యంరెడ్డి, సాయి జన శేఖర్, శ్రీరామ్, సత్యనారాయణ, దాసరి కర్ణ, శివకుమార్, కట్ట బుచ్చన్న గౌడ్, శ్రీనివాస్, రఫీక్, అశోక్, రమేష్, లడ్డు, శివ తదితరులు పాల్గొన్నారు.