Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓయూ స్టూడెంట్స్ ఎజెండా అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఓయూ కమిటీ అధ్వర్యంలో శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేటు వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. వందలాది విద్యార్థులు ఫ్లకార్డులు చేత పట్టుకుని, తమ డిమాండ్లను నెరవే ర్చాలని నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీఎస ్యూ ఓయూ నాయకులు ఎస్.నాగేశ్వర రావు, ఎన్.సుమంత్, కె.స్వాతి మాట్లా డుతూ నేటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉస్మానియా యూని వర్సిటీ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్య మంత్రిని కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడిన ఓయూ విద్యార్థుల అభివధి నిధులు కేటాయించాలని కోరారు. ఓయూలో పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నూతన విద్యా ప్రోత్సాహక పదకాలైన ఉచిత మెస్ వసతి, ఫెలోషిప్ వసతి, ఆరోగ్య భద్రత వంటి వసతులు ప్రారంభించాలన్నారు. 8 ఏండ్లపాటు తెలంగా ణ పాలనలో ఓయూలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ స్టూడెంట్స్ ఎజెండాలోని ప్రధాన అంశాలను విద్యార్థులు ఉప యుక్తంగా ఉంటాయనీ, వీటిని పరిష్కరించడం ద్వారా నాణ్యమైన మానవ వనరులు అభివృద్ధి సాధ్యమన్నారు. తక్షణమే ఓయూ స్టూడెంట్స్ ఎజెండా అమలుకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చ చేసి, నిధులు కేటాయించాలనీ, లేనియెడల రాబోయే రోజుల్లో విద్యార్థుల ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చించా రు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఓయూ నాయకులు వెంకటేష్, భువన, ప్రశా ంత్, నరేష్, సాయి, శివారెడ్డి, వినీల్, సంపత్, స్నేహ, మనోహర్, నివేదిత, స్వర్ణలత, అశోక్, శ్రీవాణి, భవాని, శశాంక్, చందు, మారుతి, నరేష్, చంద్ర ప్రకాష్, వనిత, పరమేష్, సుమన్, మణికంఠ, ఆర్తి, నవీన్,ఫిరోజ్ పాల్గొన్నారు.