Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మూసీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని గోల్నాక కార్పొరేటర్ దుసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం గోల్నాక డివిజన్ పరిధిలోని న్యూ తులసిరామ్ నగర్ బఫర్ జోన్లో చెత్త పేరుకుపోవడంతో ఇండ్లల్లోకి పాములు వస్తున్నాయని బస్తీవాసులు కార్పొరేటర్‌కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం స్పందించిన కార్పొరేటర్ బఫర్ జోన్ లోని మూడు ఎకరాల్లో కార్పొరేటర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలో కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా దురాక్రమలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లామనీ, మూసీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరణ చేసి ఫంక్షన్ హాల్, వాకింగ్ ట్రాక్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రులు త్వరలో గోల్నాక డివిజన్లో పర్యటించి సుందరీకరణ పనులతో పాటు ఫంక్షన్ హాల్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు తెలిపారు.