Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గత ప్రభుత్వాలు రూపొందించిన మాస్టర్ ప్లాన్ 2031 నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి కోరారు. ఆజామాబాద్ ఇండిస్టీయల్ ఏరియాలో గురువారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనా స్థలాన్ని శుక్రవారం సందర్శించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరంలో జనావాసాల మధ్యనున్న పరిశ్రమలను 2004లో శివారు ప్రాంతాలకు తరలించిన ట్టు తెలిపారు. లీజు పేరుతో విలువైన ప్రభుత్వ స్థలాలను సొంతం చేసుకోవడానికి కొందరు యత్నిస్తున్నట్టు తెలిపా రు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఫైర్ శాఖలలో నిబంధ నలు అమలు కావడం లేదన్నారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ నిద్ర పోతోందన్నారు. విశాలమైన స్థలాలున్న హైద రాబాద్‌లో 42 అంతస్తుల భవనాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రాణిగంజ్, ఆజామాబాద్, నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదా లు చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోని రాజకీయ పార్టీలు, ఎన్వీ, పర్యావరణ వేత్తలు, సైంటిస్ట్‌లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నా రు. ఈ సందర్భంగా పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో ఫొన్లో మాట్లాడి నివాస ప్రాంతాల్లోని పరిశ్రమలను తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కన్నా డానియేల్, రామకృష్ణ, ఎస్సీ సెల్ చైర్మన్ రాజు, జగన్, లింగం గుప్తా, నరసింహా, తదితరులు పాల్గొన్నారు.