Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
కేంద్ర సామాజికశాఖ మంత్రి రాందాస్ అథావలే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్యను శుక్రవారం రాత్రి విద్యానగర్ లోని బీసీ భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వ కంగా కలిసినట్టు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం అంటేనే చారిత్రాత్మక పోరాటాలకు నిలయంగా అభివర్ణిం చారు. ఆర్.కృష్ణయ్య ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియా డారు. కృష్ణయ్యను రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియమించడం హర్షించ దగ్గ విషయం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. ఆర్.కృష్ణయ్య అభ్యర్థన మేరకు బీసీలకు అదనపు బడ్జెట్ కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. భవిష్యత్తులో ఆర్.కృష్ణయ్య చేసే ప్రతి ఉద్యమానికీ తన పూర్తి మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రమంత్రి రాందాస్ అథావలే ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో కూడా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. బీసీలకు అదనపు బడ్జెట్ కేటాయించడానికి తన వంతుగా కృషి చేస్తానని హామీనివ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. మంత్రికి హదయపూర్వక ధన్యవాదాలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాల్ కృష్ణ, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్ కుమార్, బార్క కృష్ణ, భూపేష్ సాగర్, అనంతయ్య, వేముల రామకృష్ణ, భాస్కర్ ప్రజాపతి, తదితరులు పాల్గొన్నారు.