Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.కనీస వేతనం రూ.24 వేలివ్వాలి
ఏఐటీయూసీ రాష్ట్ర సమితి డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, వారికి కనీస వేతనాల చట్టం అనుసరిస్తూ కనీస వేతనం రూ.24 వేలుగా చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద రాష్ట్ర మున్సిపల్ స్టాప్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి.యూసఫ్, ప్రధాన కార్యదర్శి ఎం.బాల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నేటికి జీఓ 4 ప్రకారం కార్మికులకు అనేక మున్సిపాల్టీలలో 11వ పీఆర్సీ విడుదలై సుమారు రెండేండ్లు గడుస్తున్నా ఏరియర్స్ చెల్లించలేదనీ, మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ఏరియర్స్ చెల్లించని మున్సిపాల్టీలపై చర్యలు తీసుకుని మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపా లిటీలు, పురపాలక సంఘాలు కార్పొరేషన్లలో చాలీచాలని వేతనాలు పొందుతున్న మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలనీ, స్థానిక సంస్థల నుంచి కార్మికులకు జీతాలు చెల్లించే విధానం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వి.యస్.బోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం కార్మిక కుటుంబాలు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారనీ, వెంటనే వారికి ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు అందించాలనీ, పీఎఫ్ చెల్లింపులు సంక్రమంగా జరిపించాలనీ, కార్పొరేష న్లు, మున్సిపాలిటీలలో, పురపాలక సంఘాల్లో పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచా లనీ, ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలనీ, లేకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. నిరవధిక ఆందోళనలకు సైతం సిద్దం అవుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.ప్రేమ్ పావని, ఎం.నరసింహ, కార్మిక సంఘం అధ్యక్షులు యేసు రత్నం, ఉపాధ్యక్షులు మంద వెంకటేశ్వర్లు, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వెంకట య్య, కె.రవిచంద్ర, కె.జయచంద్ర, పి.నర్సింగరావు, కోశాధికారి బొడ్డుపల్లి కిషన్, రాష్ట్ర సమితి సభ్యులు మార్టిన్, వి.జయపాల్ రెడ్డి, సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.యన్.శేఖర్, చర్లపల్లి రాములు, నాయకులు లక్ష్మమ్మ, సుశీల, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, భూమేష్, సతీష్, టి.ఆనంద్, సాయిలు, నర్సమ్మ, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.