Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అభ్యర్ధుల్లో ఎంపిక చేసిన 100 మందికి సిటీ కళాశాల సెంటర్లో ఉచితంగా శిక్షణ కల్పిస్తున్నామని డైరెక్టర్ అలోక్ కుమార్ అన్నారు. సిటీ కళాశాలలో గ్రూప్ - 2 శిక్షణ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సిటీ కళాశాలలో గ్రూప్ 1 ప్రిలిమ్స్, కానిస్టేబుల్, ఎస్సై ఉచిత శిక్షణ అందిస్తున్న బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్ - 2 శిక్షణ కూడా ప్రారంభించింద న్నారు. ఈ సెంటర్ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ కి ఎంపికైన అభ్యర్థులు ఉస్మానియాలో శిక్షణ పొందుతున్నా రని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థుల క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. అభ్యర్థులకి తమ కళాశాల అధ్యాపకుల సేవలు, గ్రంథాలయ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. పి.బాలభాస్కర్ తెలిపారు. స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ బాలకృష్ణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిటీ కాలేజీ కెరీర్ గైడెన్స్ విభాగం కన్వీనర్ డాక్టర్.పద్మ అనూరాధ, డాక్టర్ యాద య్య, డాక్టర్.జె.నీరజ, డాక్టర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.