Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య
- హిమాయత్‌నగర్, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్ష
వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ-ముషీరాబాద్
అర్హులైన ప్రజలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ప్రతి కుటుంబానికీ రూ. 5 లక్షలు ఇవ్వాల న్నారు. అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే పూర్తి అయిన ఇండ్లు నెర్రెలు వాస్తున్నా, వాటి గొళ్ళాలు ఊడిపోతున్నా అర్హులైన పేదలకు కేటా యించకపోవడం బాధాకరమన్నారు. ఇల్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూంల సాధనకు ఈ నెల 9వ తేదీన ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర నాయకులు ఎం. దశరథ్, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఐత విజరు కుమార్, ఐద్వా నగర కార్యదర్శి ఎ.పద్మ, మత్స్యకార సంఘం నగర కార్యదర్శి శ్రీరాములు, సీఐటీయూ సహాయ కార్యదర్శి పి.విమల, సీఐటీయూ నాయకులు పుల్లారావు ఆవాజ్, నాయకులు పాషా, తదితరులు పాల్గొన్నారు.
ధూల్‌పేట్ : పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించి ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఆర్. వెంకటేష్, ఐద్వా సౌత్ జిల్లా కార్యదర్శి శశికళ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిం చాలనీ, కొత్తగా ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. ఆసిఫ్‌నగర్ మండల పరిధిలోని వివిధ బస్తీల్లో 8 ఏండ్లుగా వేలాది మంది పేదలు డబల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఉన్నారన్నారి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం అర్హులైన వారికి వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంకా చాలా మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాని వారు ఉన్నారనీ, వారికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. సొంత జాగా ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల ఆర్థిక సహాయం అందజేయాలనీ, నగరంలోని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి జీవో 58 ప్రకారం వారు నివసిస్తున్న స్థలాలను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో వికలాంగులకు 5శాతం కేటాయిం చాలని డిమాండ్ చేశారు. దీక్ష అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి సౌత్ జిల్లా కార్యదర్శి కల్యాణ్, సీఐటీయూ నాంపల్లి జోన్ నాయకులు బ్రోజి శంకర్, ఎన్పీఆర్డీ నాయకులు కుమార్, సత్యనారాయణ, రాజు మహిళా సంఘం నాయకులు రజియా, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
అంబర్‌పేట : అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లు వెంటనే ఇవ్వాలని అంబర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వమించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో పేదలను మోసం చేస్తుందన్నారు. 9 ఏండ్లుగా అమలు కానీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం కేవలం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే పరిశీలిస్తామని అనడం అన్యాయం అన్నారు. నగరంలో నిర్మించి రెడీగా ఉన్న లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను ఉగాదిలోపు లబ్దిదారులను గుర్తించి వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఉన్నా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. అనంతరం తహసీల్దార్ లలితకు వినతిపత్రం అందజేశారు. ఇండ్ల సమస్యను త్వరలో పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులను గుర్తించి లక్షల మందితో ధర్నా నిర్వ హించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్, అంబర్‌పేట జోన్ కన్వీనర్ జి.రాములు, జోన్ నాయకులు డీఎల్ మోహన్, ధనరాజ్ సుబ్బారావు, రైస్, సహదేవ్, భూషణం, వినోద, వీర్య, శ్రీనివాస్, గోపి, రాములు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.