Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రూ.2 వేల కోట్లేనా..?
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అంబర్పేట
కేంద్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కాచిగూడలో అభినం దన్ హౌటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి మాట్లాడారు. రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేశారన్నారు. గతంలో ప్రధాని, కేంద్రమంత్రులను బీసీ సంఘాల నాయకులు కలిసి బీసీలకు రూ.2లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరగా పెంచుతామని హామీని ఇచ్చినట్టు తెలిపారు. రూ.2వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే, 75 కోట్ల మంది బీసీలకు ఎంత వస్తుందని ప్రశ్నించారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రూ.2వేల కోట్లు పంచితే ప్రతి రాష్ట్రానికీ రూ.50 కోట్లు కూడా రావన్నారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల కింద కేంద్ర విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన ప్రత్యేకంగా ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థుల ఫీజులు పెద్దమొత్తంలో రూ.లక్షా 40 వేల నుంచి రూ.ఒక లక్షా 80 ఉందనీ, రిజర్వేషన్ల కింద సీటు పొందిన బీసీ విద్యార్థులు ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఎలా కడతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ సంక్షేమానికి ప్రతి రాష్ట్రం రూ.5 వేల నుంచి రూ.30 వేల కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికీ రూ.35 కోట్లు కేటాయించడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వ పథకాల మంజూరుకు 80 శాతం గ్రాంటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే బీసీ పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్రాంటు లేదా ఎలాంటి ఇతర సహాయం ఇవ్వడం లేదన్నారు. కుల వృత్తుల ఆధునీకరణకు బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయడం లేదన్నారు. జాతీయ బీసీ కార్పొరేషన్ కేంద్ర రుణాలు ఇవ్వడం ఆపేశారని చెప్పారు. జాతీయ బీసీ కార్పొరేషన్ కింద బీసీలకు కుల వృత్తుల స్థానంలో ప్రత్యామ్నాయ ఉపాధి కింద స్వయం ఉపాది పథకాలకు రూ.లక్ష, రూ.2 లక్షల రుణాలు ఇవ్వడానికి మందుకు రాని కేంద్రం బడా కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు గుర్తు చేశారు. కేంద్రానికి పేదలకు రుణాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదన్నారు. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కుమ్మక్కై రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగవేస్తూ ప్రభుత్వాలు, ప్రజలను నిండా ముంచుతున్నార న్నారు. బ్యాంకులలో జరిగే పూర్తి మోసాలు ఇంకా చాలా భయటకు రావడం లేదన్నారు. రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తల అవతారమెత్తి బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా మాఫీ చేసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ కేటాయించకుండా అన్యాయం చేస్తుంటే పార్లమెంటులో 96 మంది బీసీ సభ్యులు, 36 రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారు.. కానీ బీసీల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. పేదవారైన బీసీలు అభివృద్ధి చెందాలంటే బడ్జెట్ కేటాయించకుండా, స్కీములు పెట్ట కుండా ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ''ప్రధానమంత్రి బీసీ మోడీ'' బొమ్మ చూపి బీసీ ఓట్లు వేయించుకుని బీజేపీ బీసీలకు మొండిచేయి చూపుతున్నారన్నారు. బీజేపీ, కేంద్రం తన బీసీల వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే దేశవ్యా ప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తు న్నాం. బీసీలకు రివైజ్డ్ బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటా యించాలనీ, లేకపోతే తిరుగుబాటు తప్పదన్నారు.