Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు
నవతెలంగాణ, కేపీహెచ్బి :
ప్రజలకు మౌలిక వసతుల కల్పించేలా కషి చేస్తానని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్బి డివిజన్ పరిధిలో ఇటివల శంకుస్థాపన చేసిన పార్కు పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి సెంటర్ పార్క్ వద్ద జరుగుతున్న పనులను , రమ్య గ్రౌండ్ వద్ద అభివద్ధి పనులు జరుగుతున్న మూడు పార్కులను, 9వ ఫేజ్ లోని ఇండోర్ షటిల్ కోర్ట్, మలేషియన్ టౌన్షిప్ వద్ద డి మార్ట్ వెనకాల ఉన్న పార్క్ పనులను, క్రికెట్ మైదానం కొరకు జరుగుతున్న అభివద్ధి పనులను పరిశీలించారు. అనంతరం భువన విజయం గ్రౌండ్ లోని ఇండోర్ షటిల్ కోర్ట్ వద్ద అక్కడ క్రీడల్లో పాల్గొన్న ప్రజలను సౌకర్యాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీరు, టాయిలెట్స్ అలాగే ప్రహరీ గోడలు ఎత్తు పెంచాల్సిందిగా ఆదేశించారు. యువతకు క్రికెట్ ఆడుకునేటట్లు తగిన ఏర్పాట్లు చేసి త్వరగా వారికి అందించాలన్నారు. పక్కనున్న ఖాళీ స్థలాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. పార్కుల్లో మౌలిక వసతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో కూడా ఇబ్బంది కలగకుండా విద్యుత్ స్తంభాల నియమించి మంచినీరుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. త్వరగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డి ఈ ఆనంద్, ఏఈ సాయి ప్రసాద్ పాల్గొన్నారు.