Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ ఆఫీసులో కళాతపస్వి దర్శకులు కె.విశ్వనాథ్ సంతాప సభ నిర్వహించారు. పట్నం సాంస్కతిక వేదిక ప్రధాన కార్యదర్శి డిజి.నరసింహారావు, ప్రపంచ శాంతి సంఘం నాయకులు పి ఎస్ ఎన్ మూర్తి కే విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంతాప సభకు స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. పట్నం సాంస్కతిక వేదిక ప్రధాన కార్యదర్శి డిజి.నరసింహారావు మాట్లాడుతూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అనేక ఉత్తమ సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమారంగానికి ఎనలేని సేవ చేసిన కె.విశ్వనాథ్ ఎంతో మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఎన్నో అభ్యుదయ చిత్రాలను దర్శకత్వం వహించి అందరిని మెప్పించడం జరిగింది అని చెప్పారు. వారి లేని లోటు తెలుగు పరిశ్రమకే కాక ప్రజాస్వామ్యవాదులందరికీ ఎంతో తీరనిలోటని అన్నారు.ప్రపంచ శాంతి సంఘం నగర నాయకులు పి ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ వితంతు వివాహాలు ప్రోత్సహించుతూ కులాలకతీతంగాను ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాంస్కతిక విలువలను రక్షించుతూ అనేక చిత్రాలను తీసి నూతన వరబడిన సష్టించారని చెప్పారు. కమలహాసన్, చిరంజీవులకు వారి నటన విశతికి ఎంతో వన్నెతెచ్చారని అనేకమంది దర్శకులకు, నటులకు, సాంకేతిక వర్గాలకు గురువుగా నిలిచారని చెప్పారు. అంతేకాకుండా నటనలోనూ నూతన పోకడలు చూపించారని చెప్పారు. అంతేకాకుండా తాను రచయితగా కూడా వెలుగొందారని అన్నారు. చిత్ర సీమ ఉన్నంతవరకు వారి పేర్లు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు. అనంతరం స్ఫూర్తి గ్రూప్ సభ్యులు సురేష్ కుమార్ మాట్లాడుతూ తెలుగుతనాన్ని ప్రపంచానికి అత్యున్నతంగా చూపించారని వారి ఎల్లప్పుడూ తెలుగువారి గుండెల్లో ఉంటారని అన్నారు. సభ అనంతరం సభికులందరూ చిత్రపటానికి పుష్పగుచ్చాల నుంచి నివాళి అర్పించారు. సంతాప సభలో స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు శ్రీమన్నారాయణ, ప్రముఖ రచయిత పిబి చారి , ట్రేడ్ యూనియన్ నాయకులు చంద్రశేఖర్ , ఉనికష్ణన్, ఎన్.శ్రీనివాస్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.