Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మహేందర్ కొడిచెర్ల
నవతెలంగాణ-కూకట్పల్లి
మూసాపేట్ డివిజన్ అవంతి నగర్లో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు ఏరకంగా నిర్మిస్తున్నారని పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ మహేందర్ కోడిచెర్ల, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని, పనులు ఆలస్యమైతే ఉపేక్షించేది లేదని, నాణ్యత లోపం కలగకుండా పనులు చేయాలని లేనిపక్షంలో కాంట్రాక్టర్ పై ,అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు, కాలనీ వాసులు అప్రమత్తమై మీ ఇంటి నుండి డ్రైనేజీ లైన్ వెళుతున్నప్పుడు మీకు అనుగుణంగా డ్రైనేజీ లైన్ నిర్మించుకోవాలని, పనులలో నాణ్యతపై మీకు సందేహం ఉంటే మాకు తెలుపాలని, లేదా నిర్మాణా స్థలంలో సంబంధిత అధికారులకు తెలుపాలన్నారు. ఈ కార్యక్రమం లో వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్ కాలనీ అధ్యక్షులు రాఘవేంద్ర , ఎర్ర స్వామి , రమేష్ నాయర్ శోభా రాజన్ . నర్సింహా, అనిల్ , శ్రీకాంత్ , యోగేష్ , వెంకట్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.