Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటోన్మెంట్ ఐదవ వార్డ్‌లోని కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి డా.వెంకట్‌తో కలిసి తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా.విశాల్, ఎస్పీహెచ్ఓ డా.రాజకుమారి, డా.శ్రీలక్ష్మీ, బస్తీ ప్రసిడెంట్ కొంపల్లి దాసు, నర్సింగ్, అనిల్, శివ, రవి, సుధాకర్, మహంకాళి షర్వీన్ ఇంకా ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్తం అనేది ఉండకుండా ఉండేందుకు గాను అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను కూడా ఈ కార్యక్రమం ద్వారా చేపడుతున్నారని వివరించారు అలాగే కంటోన్మెంట్‌లోని సంజీవయ్య అవి సెక్షన్లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కంటిన్యూ భర్తీ దౌఖానాలు ఏర్పడ్డాయని, అంతక ముందు ఎలాంటి కనివిని ఎరగలేదని చెప్పారు.