Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు
- రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్. చౌహాన్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసరగుట్ట బ్రహ్మోత్సావాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ అన్నారు. శుక్రవారం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సావాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ భక్తులకు ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మహిళా భక్తులు, పిల్లలు, వద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం డాక్టర్ల బందంతోపాటు అంబులెన్సును కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలియజేశారు. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. షీ టీం బందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని, సంతోషంగా దేవుడి దర్శనం చేసుకోవాలని ఆకాక్షించారు. మల్కాజ్గిరి డీసిపి డి.జానకి ఐ.పి.ఎస్, కీసర ఇన్స్పెక్టర్, ఇతర అధికారులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ తటకం రమేష్ శర్మ, డీసీపీి జానకి ధరవత్, ఏసీపీ రష్మీ పెరమాల్, సీిఐ రఘువీర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కీసర పోలీసు స్టేషన్లను కమిషనర్ సందర్శించారు.