Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం తో మెరుగైన వైద్యం చేయించుకొని ఎంతో మంది పునర్జన్మ ను పొందారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద అమీర్‌పేట డివిజన్ బల్కంపేటకు చెందిన నరేష్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2.50 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు పత్రాన్ని (ఎల్ఓసీ)ని నరేష్ కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ యాదy,్ మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారితో కలిసి అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన నరేష్ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఒక భవన నిర్మాణదారుడి వద్ద పనిచేస్తున్న నరేష్ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చికిత్సకు అవసరమైన ఆర్ధిక సహాయం కోసం మాజీ కార్పొరేటర్ శేషుకుమారి సహకారంతో మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి తమ పరిస్థితిని విన్నవించారు. మంత్రి చొరవతో 2.50 లక్షల రూపాయలు మంజూరు కాగా నేడు నరేష్ తల్లి లక్ష్మమ్మ, భార్య రేఖకు అందజేశారు. తమకు ఆర్ధిక సహాయం అందించేందుకు కషి చేసిన మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు వారు కతజ్ఞతలు తెలిపారు.