Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్
మల్కాజిగిరి-నవతెలంగాణ
అర్హులైన నిరుపేదలందరికీి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారంనాడు మునిసిపల్ కార్యాలయం ముందు వేలాది మంది ప్రజలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సీఐటీయూ మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఐ(ఎం ) మండల కార్యదర్శి ముస్తాల కపాసాగర్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి నర్సింగ్ రావ్ మాట్టాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆల్రెడీ నిర్మించిన ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించకపోవటం వల్ల తలుపులు, కిటికీలు దొంగతనం జరుగుతున్నాయని, గోడలు పగిలిపోతూ పెచ్చులూడుతున్నాయి. ఇప్పటి వరకు కేటాయించకపోవటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ, జాప్యం జరిగితే ఊరుకునేది లేదు అని ప్రజా సంఘాల ఐక్య వేదిక హెచ్చరిక చేసింది. ఫిబ్రవరి 9వ తేదీ న ఇందిరా పార్క్ వద్ద జరిగే ఘహా ధర్నా కార్యక్రమంలో అందరూ తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రాజ్యలక్ష్మీ, ఐద్వానాయకులు నాయకులు షాహిన్, బీసీడబ్ల్యు నాయకులు యాదగిరి, సరోజ, అనసూయ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజుకి వినతిపత్రం సమర్పించింది. కమిషనర్ సానుకూలంగా స్పందించిపై అధికారులకు రాసి పంపిస్తాను అని చెప్పారు.
కాప్రా : తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాప్రా మున్సిపల్ ఆఫీసు వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా పట్నం రాష్ట్ర నాయకులు డిజి నరసింహారావు హాజరై మాట్లాడారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉచితంగా కేటాయిస్తామని వాగ్దానం చేశారని, ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్కరికీ ఇల్లు కేటాయించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీిఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు ,నాయకులు పి.వెంకట పి.గణేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ ఎన్.శ్రీనివాస్, డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులు, నాయకులు ఎన్.నాగిరెడ్డి,శ్రీనివాసరెడ్డి సఫియా, నూర్జహాన్, సుహాసిని, రమ, మమత, కవిత, లక్ష్మి తదితరులు హాజరైనారు.
ప్రజా సంఘాల పోరాట వేదిక
కుత్బుల్లాపూర్ : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు ఎండి.సలీం, పి.అంజయ్య, ఆర్.స్వాతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే పేదలందరికీ ఇండ్లు, ఇళ్లస్థలాలు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, లేని ఎడల ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలతో కలిసి ఆక్రమిస్తామని హెచ్చరించారు. అనంతరం వినతి పత్రాన్ని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేణుకకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు ఎస్.కె బురాన్, ముక్తార్, శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ : కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని, ఇండ్ల స్థలాలు ఉన్న పేదలకు రూ.5లక్షలు ఇండ్లు కట్టుకోవడానికి కేటాయించాలని జీవో నెంబర్ 58, 59 కొరకు అప్లై చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని సీిఐటియు కూకట్పల్లి మండల కార్యదర్శి కె.కష్ణా నాయక్, పట్నం కార్యదర్శి ఎం.శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాసంఘాల పోరాట కమిటీ పిలుపులో భాగంగా బాలానగర్ మండలం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే వారికి త్వరగా సర్వేలను పూర్తి చేసి ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎన్ బాలపీరు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జే.శివకుమార్, ఎన్పిఆర్డి జిల్లా కార్యదర్శి రంగారెడ్డి, ఆవాజ్ కూకట్పల్లి కమిటీ కార్యదర్శి ఫయాజ్, సీిఐటీయు మండల నాయకులు ధర్మారావు, నరసింహ, ప్రమీలమ్మ, గంగాదేవి, రాములు తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని ప్రజా సంఘాల పోరాట కమిటీ సభ్యులు కూకట్పల్లి మండల కేంద్రం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే వారికి త్వరగా సర్వేలను పూర్తి చేసి ఇళ్లను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నం కార్యదర్శి ఎం శంకర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎన్ బాల పేరు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జే శివకుమార్, ఎన్పిఆర్డి జిల్లా కార్యదర్శి రంగారెడ్డి ఆవాజ్, కూకట్ పల్లి కమిటీ కార్యదర్శి ఫయాజ్, సీఐటీయూ మండల నాయకులు ధర్మారావు, నరసింహ, ప్రమీలమ్మ, గంగాదేవి, రాములు తదితరులు పాల్గొన్నారు.