Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి
నవతెలంగాణ - మీర్ పేట్
ఏ ఆధారం లేని అభాగ్యులకు అన్ని రకా లుగా ఆసరాగా ఉంటున్న ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీ సేవలు అభినందనీయమని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి అన్నారు. మీర్పేట్ మున్సిప ల్ కార్పొరేషన్ 35వ డివిజన్ కార్పొరేటర్ జిల్లా సౌందర్య విజరు ఆధ్వర్యంలో ఆయుష్మాన్ గ్రూ ప్ ఆఫ్ చారిటీ సహకారంతో ప్రశాంతి నగర్ ప రిధిలోని వికలాంగులు, వద్ధులు, వితంతువుల కు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఆధారం లేకుండా ఉ న్న పేద, బడుగు బలహీ న వర్గాల ప్రజలకు రూ.1500, నిత్యావసర సరుకులు అందజేయ డం మంచి కార్యక్రమం అని తెలిపారు. దాదాపు 200 మందికి ప్రతినెల ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ జి ల్లా సౌందర్య విజరు పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని అభినందించారు. అనంతరం వికలాంగులకు, వద్ధులకు, వితంతువులకు రూ.1500 అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ నందు, ఇంద్రావత్ రవి నాయక్, గజ్జల రాంచందర్, కోఆప్షన్ సభ్యులు రజాక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీప్ లాల్ చౌహన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అశోక్, ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీ సభ్యులు శ్రీదేవి, ప్రమీల, శ్రీలత వివిధ కాలనీలవాసులు, ప్రజలు పాల్గొన్నారు.