Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చల్లా నర్సింహ్మారెడ్డి
- కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-బడంగ్ పేట్
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి పన్నులు తగ్గించే వరకు పోరాటం ఆగదని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్శిహ్మరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబావి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడంగ్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ జనాభా పేద మధ్య తరగతికి చెందినవారే ఉన్నారని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి, వాటిపైన ఇంటి ట్యాక్సీలు ఎక్కువ మొత్తం పెంచడంతో సంపాదనంతా ప్రభుత్వానికే చెల్లించాల్సి వస్తుందని మండిపడ్డారు. అందుకోసం పాత విధానమే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు. గతంలో కార్పొరేషన్ ముందు ధర్నా చేసిన ఫలితంగానే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్ కార్పొరేషన్లో తాత్కాలికంగా పన్నులు చెల్లించడం ఆపివేయాలని కమిషనర్‌ను ఆదేశించారని తెలిపారు. ఇక్కడ కూడా పాత పన్నుల విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, బడంగ్పేట్ కార్పొరేటర్లు రాళ్లగుడం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, మనోహర్, బాలునాయక్, జైహింద్, పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, మీర్పేట్ కార్పొరేటర్ సిద్ధాలా శ్రీశైలం, నాయకులు బి.గవర్దన్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పందులు వెంకటేష్ గౌడ్, బడంగ్ పేట్ మహిళా అధ్యక్షురాలు అమత నాయుడు, గట్టు బాలకష్ణ, కీసరి యాదిరెడ్డి, సురేందర్ రెడ్డి, సుభాష్‌రెడ్డి, గెల్ల రవీందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, పరుశరామ్ తదితరులు పాల్గొన్నారు.