Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అనేక మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని బోడు ప్పల్ మున్సిపల్ కార్పొరే షన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని డీప్యూటి మే యర్ కొత్త లక్ష్మీ రవిగౌ డ్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా మేయర్ బుచ్చి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కంటి సమస్యపై దష్టి సాధిం చేందుకు గాను కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారన్నారు. మొదటి విడత విజయవంతంగా నిర్వహించిన ఈ పథకం రెండవ విడతలో సత్ఫలితాలిస్తుందన్నారు. వంద రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్గౌడ్ బీఅర్ ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు