Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్ల సాధన పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ సుంకరి వీరయ్య
నవతెలంగాణ-హయత్ నగర్
నగరంలో పేదలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ హామీని నేటికీ అమలు చేయకపోవడం సరికాదని ఇండ్ల సాధన పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ సుంకరి వీరయ్య వెల్లడించారు. ప్రజా విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వంపై పోరాటం చేయటానికి వెనుకాడమని ఆయన అన్నారు. శుక్రవారం హయత్‌నగర్‌లో ఉన్న తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ, ఐద్వా, కేవీపీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ పరిధిలో ప్రస్తుతం నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్లు లేని పేదలకు ఎల్లప్పుడూ ఎర్ర జెండా అండగా, తోడుగా ఉంటుందని చెప్పారు. తదనంతరం అక్కడికి వచ్చిన బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించి తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి నర్సింహ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, సీఐటీయూ హయత్‌నగర్ సర్కిల్ నాయకులు కష్ణ, ఐద్వా జిల్లా నాయకురాలు సంధ్య, ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు గోపి, ఐద్వా నాయకురాలు రాణి, కవిత, శ్రీను, భాస్కర్, వసంత, పద్మ, అశోక్, దయనంద్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లు ఇండ్ల స్థలాలు లేని వారికి కేటాయించాలి
సరూర్ నగర్ : ఇండ్లు ,ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు వెంటనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గంధం మనోహర్, వత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం సరూర్‌నగర్ మండల పరిధిలోని ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సరూర్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు మూలల నుండి వివిధ జిల్లాలకు చెందిన కార్మిక వర్గం బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి కడుభారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. వాళ్ల జీవనం భారంగా మారిందని అన్నారు. రియల్ ఎస్టేట్ వారు భూములు ఆక్రమించుకొని స్వేచ్ఛగా విక్రమిస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. ఈ సమస్యలపై నెల 9న ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ సర్కిల్ సీఐటీయూ కన్వీనర్ మల్లె పాక వీరయ్య, ఎల్బీనగర్ సర్కిల్ సీఐటీయూ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, మత్స్యకార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకన్న, మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా నాయకులు కట్ట శ్రీనివాస్, గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎం.గోపి నాయక్, మల్లేష్, మేకల కష్ణ, దుర్గారావు, కడారి రాములు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఇంటి స్థలాల కోసం ధర్నా
అబ్దుల్లాపూర్ మెట్ : అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రాగిడి వెంకట్ రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు ఇళ్లు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం ఉన్నవారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్య్సకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ్మ, మండల కార్యదర్శి నర్సింహ్మ, నాయకులు శ్రీశైలం, సర్వయ్య, మల్లయ్య, సర్వయ్య, జంగయ్య, శివ, మైసయ్య, అనిత, వసంత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల స్థలంతోపాటు రూ.5లక్షలు ఇవ్వాలి
ఘట్కేసర్ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా పేదలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇంటిస్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య ఎన్.సబిత డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఘట్కేసర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య, ఎన్.సబిత మాట్లాడుతూ మండ లంలో వాస్తవ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేసి ఇండ్ల స్థలం లేనివారికి 120 గజాల ఇంటి స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేయాలని వారు కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గతంలో పలుమార్లు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ అర్హులకు ఇండ్లు దక్కలేదన్నారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. మండలంలో వివిధ గ్రామాల నిరుపేదలు నిత్యం తమ కుటుంబాల పోషణ నిమిత్తం హైదరాబాద్‌కు పనులకోసం పోయి వస్తుంటారు. సొంతిల్లు లేక అద్దె గదుల్లో నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసమస్యలపై ప్రభుత్వం దష్టిపెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో ఐద్వా మండల అధ్యక్షురాలు, జి.నాగమణి, కార్యదర్శి సిహెచ్.అరుణ, ఉపాధ్యక్షురాలు కె.అలివేలు, ఎన్పీఆర్డీ మండల కార్యదర్శి చంద్రమోహన్, బిహార్ సునీత, కె.అనసూర్య, ట్రాన్స్పోర్ట్ యూనియన్ మండల అధ్యక్షులు సిహెచ్.శ్రీకాంత్ గౌడ్, రత్నమ్మ, చంద్రమౌళి, స్వప్న, ఫర్జానా, బాలమణి, జమీల, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉప కమిషనర్‌కు వినతి
ఉప్పల్ : ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఇండ్లు లేక అద్దె కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్న పేద బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉప కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వినోద, వెంకన్న, భీష్మాచారి మాట్లాడుతూ పొట్ట కూటి కోసం నగరానికి వచ్చి ఇబ్బందులు పడుతూ అద్దె కట్టలేక అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్న అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఐక్యవేదిక మహాధర్న
తుర్కయాంజల్: ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్న ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ముందు శుక్రవారం తుర్కయంజాల్ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసి సూపరింటెండెంట్ అమరజ్యోతికి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల పోరాట వేదిక రంగారెడ్డి జిల్లా నాయకులు, మంచాల మండల మాజీ జెడ్పిటీసీ పగడాల యాదయ్య, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కిషన్ మాట్లాడుతూ అదేవిధంగా తుర్కయంజాల్ మున్సిపల్ ప్రాంతంలోని అనేక మంది స్థానిక నిరుపేదలు కూడా ఇల్లు ఇండ్ల స్థలం లేక అత్యంత దీనమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఇటువంటివారిని అందర్నీ ప్రభుత్వం గుర్తించి అర్జీ పెట్టుకున్న వారందరికీ పక్కా గహాలను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజా సంఘాల పోరాటా వేదిక ఆధ్వర్యంలో వందలాదిమంది నిరుపేదలు దరఖాస్తులు పెట్టుకున్నారని వెంటనే ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్, ఐద్వా జిల్లా కార్యదర్శి సుమలత, స్థానిక నాయకులు టి.నర్సింహ్మ, ఐ.భాస్కర్, కె.వెంకట కష్ణ, బి.శంకరయ్య, కొండిగారి శంకర్, ఐ.కష్ణ ,మలాద్రి,రత్నమ్మ,శారదా, యాదగిరి, శివ ప్రసాద్ గౌడ్, అజరు గౌడ్, ఆంజనేయులు, శ్రీను నాయక్ ,ఉమా, స్వప్న తదితరులు పాల్గొన్నారు.