Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అర్జీలు పెట్టుకున్న వారికి వెంటనే డబల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేటాయించే వరకు అర్జీదారులతో కలిసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరిస్తూ రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ డబల్ బెడ్ రూం ఇండ్లతో పాటు 120 గజాల స్థలంలో రేకులతో నిర్మించుకుని ఉంటున్న వారికి కూడా తక్షణమే రూ.5లక్షలు డిమాండ్ చేస్తూ సీఐటీయూ, డీివైఎఫ్, ఎస్ఎఫ్ఐ, స్థానిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కమలానగర్లో పూర్తయిన ఇండ్లను వెంటనే అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈనెల 9వ తేదీన నగరవ్యాప్తంగా డబుల్ బెడ్రూం సమస్యను పరిష్కరిచాలని చేపట్టనున్న చలో హైదరాబాద్ మహాధర్నాను చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జె.స్వామి, టి.సాయి శేషగిరిరావు, ఆర్.అశోక్, మాలాద్రి, ఏఆర్ నరసింహ, భిక్షపతి, సోమేష్, టి.భాగ్యరాజు, జె.సువర్ణ, సమాధానం, సునీల్ కృష్ణ, బి.దేవదాస్, బి.బాలయ్య, మద్దులేటి, డాక్టర్ రాజు, సి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్ : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వ ర్యంలో షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. నాగలక్ష్మి దీక్షలో కూర్చున్న వారికి పూల దండలు వేసి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ విధానాలు, ఇంటి కిరాయిలు కట్టలేక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి మాట్లాడారు. సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ కార్మికుల సమస్యలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు సాధించుకోవడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యలా గురించి మాట్లాడారు. గోపాస్ కిరణ్ డబుల్ బెడ్ రూం ఇండ్లు సాధించుకునే వరకు పోరాడాలని మాట్లాడి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. ఈ దీక్షలు పి.శ్రీనివాస్, రాధిక, హైదరాబాద్ జిందాబాద్ ఖైరతాబాద్ జోన్ ప్రెసిడెంట్ మాధవి, కొండల్ రావు, బాలరాజు, డప్పు నర్సి హ్మ, సురేష్, శ్రీకాంత్, కష, లక్ష్మణ్, మన్యం, యాదగిరి, రామస్వా మి, సుశీల, వరలక్ష్మి, సుజాత, లక్ష్మి, బస్తీవాసులు పాల్గొన్నారు.