Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
నాణ్యమైన విద్యను అందించడంలో 38 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రా బాద్‌లోని వెస్లీ డిగ్రీ కళాశాలలో వెస్కాన్ ఫెస్ట్ రెండు రోజులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ఆర్ జయకుమార్ హాజరయ్యారు. అనంతరం నేటి సమాజంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడంలో యువ త బాధ్యత గురించి ప్రసంగించారు. ఫెస్ట్‌లో జంటనగ రాలలోని వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కతిక, సైన్స్, ఆర్ట్ అండ్ కామర్స్, కమ్యూనికేషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగాలలో వివిధ పోటీలు నిర్వహించగా విజేత లకు వెస్లీ కళాశాల డెరెక్టర్, డా.బి. విమల్, ప్రిన్సిపాల్ సుకు మార్ బహుమతులు అందజేశారు. డా రెగోని, శ్రవీన్ కృపా కర్ , జి జె జయరాజ్, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్ర మాన్ని విజయవంతంగా నిర్వహించారు.