Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
నవతెలంగాణ-కాప్రా
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాటలు వేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సూచించారు. కుషాయిగూడ చక్రిపురం కాలనీలోని శ్రీ చక్రి విద్యా నికేతన్ 34వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యత పెంచుకోవాలన్నారు. విద్యార్థులు పెడమార్గాలు పట్టకుండా వారి తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. 34 ఏండ్లుగా విద్యా ప్రమాణాలు పాటిస్తూ వేల మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన శ్రీ చక్రి విద్యానికేతన్ యాజ మాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంద ర్భంగా అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణగా పట్టుదలతో చదివితే ఎంచుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు అన్నారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు, ఈ విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమ తులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్ర మంలో శ్రీ చక్రి విద్యానికేతన్ ఫౌండర్ చైర్మెన్ మొలుగు ప్రతాపరెడ్డి, కరస్పాండెంట్ స్వర్ణలత, ప్రముఖ వైద్యులు డాక్టర్ మొలుగు చక్రధర్ రెడ్డి, డాక్టర్ రష్మీ, పాఠశాల ప్రిన్సిపాల్ లీలా భ్రమరా, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.