Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ హీరో కార్తికేయ, నాగార్జున విద్యాసంస్థల చైర్మెన్ గుమ్మడికొండ విఠల్ రెడ్డి
- నాగార్జున మౌంటెస్సోరి ఐఐటి స్కూల్ వార్సికోత్సవం
నవతెలంగాణ-మీర్పేట్
పిల్లలు బాల్యం నుంచే పోటీ తత్వాన్ని అలవర్చుకో వాలని నాగార్జున విద్యాసంస్థల చైర్మెన్ గుమ్మడికొండ విఠల్ రెడ్డి, సినీ హీరో కార్తికేయ అన్నారు. శనివారం మీర్పేట్ నాగార్జున మౌంటెస్సోరి ఐఐటి స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో కార్తికేయ, నాగార్జున విద్యా సంస్థల చైర్మెన్ గుమ్మడికొండ విఠల్ రెడ్డిలు మాట్లాడుతూ నేడు అన్ని రంగాల్లో పోటీతత్వం పెరిగిందని దాంట్లో నెగ్గాలంటే చిన్ననాటి నుంచి పోటీతత్వం అలవర్చుకోవాలని అన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు వెలికితీసి విద్యార్థులను ప్రోత్సహిం చాలన్నారు. విద్యార్థులు మార్కులు సాధించడానికి జవాబులను బట్టి పట్టించకుండా పరిజ్ఞానాన్ని పెంపొం దించే పద్ధతిలో తమ పాఠశాలలో బోధన చేస్తున్నట్లు తెలిపారు. అందుకే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వంద ఉత్తీర్ణత సాధిస్తున్నామని పేర్కొన్నారు. విద్యతోపాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, భావవ్యక్తీకరణలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని, మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉంచాలని సూచించారు. గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది విద్యా ర్థులకు ఐదు వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాగార్జున విద్యాసంస్థల వైస్ చైర్మెన్ రజని విఠల్ రెడ్డి, డైరెక్టర్ లోహిత కార్తికేయ రెడ్డి, సీఏఓ శేషారావు, అకాడమిక్ డీన్ రాజశేఖర్, ప్రిన్సిపల్ మహేష్, ఉపాద్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.