Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోడుప్పల్ కార్పొరేషన్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత కొత్త కిషోర్ గౌడ్
- మూడేండ్ల అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్
నవతెలంగాణ-బోడుప్పల్
పైన పటారంలోన లోటారం తీరుగా బోడుప్పల్ మున్సి పల్ కార్పొరేషన్ బడ్జెట్ ఉందని మేడ్చల్ అసెంబ్లీ నియోజ కవర్గం కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ అన్నారు శనివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని క్రాంతి కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడేండ్లలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో మేయర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కార్పొరేషన్ పరిధిలోని చాలా డివిజనల్లో ప్రజలకు కనీస సదుపాయాలు లేక నానా ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కార్పొరేషన్ బడ్జెట్ను అతిగా చూపించి ఎంతో అభివద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మూడుసంవత్సరాల అభివద్ధి నివేదికలో బడ్జెట్ వివరాలు అంకెల గారడిగా ఉందని, అందులో ఏమాత్రం వాస్తవాలు లేవన్నారు. గతంలో కార్పొ రషన్ శానిటేషన్ నిర్వహణలో పలుమార్లు అవార్డులు పొందిందని, అయితే ప్రస్తుతం శానిటేషన్ నిర్వహణ పూర్తిగా అధ్వాన్నంగా ఉందన్నారు. బాధ్యతగల పౌరుడిగా మేయర్ ఏనాడు కార్పొరేటర్లతో కలసి కనీసం పదిహేను నిమిషాల పాటు కాలనీలలో పర్యటించిన దాఖలాలు లేవ న్నారు. మేయర్ అవగాహన రాహిత్యం వల్ల కార్పొరేషన్లో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందని, చాలా కాలనీలలో డ్రయినేజీ వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. బోడుప్పల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లాపురం, బొల్లిగూడెం, చిలుకానగర్, చెంగిచర్ల ప్రధాన రహదారుల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం మేయర్ స్థానిక మంత్రికి ఏనాడైనా నిధుల మంజూరుకు ప్రయత్నం చేసిన సందర్భం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఏ సమస్యను పరిష్కరించుకోవాలన్నా ఇన్వార్డులోనే విసతి పత్రాలు ఇవ్వాల్సి వస్తోందని, అధికా రులను కలుసుకునే అవకాశమే లేదన్నారు. ఇప్పటివరకు ముగ్గురు కమీషనర్లు మారడం వల్ల బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధి పూర్తిగా కుంట పడుతోం దన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు, వినతి పత్రాలు అంద జేసినా ఫలితం లేదన్నారు. దాదాపు అన్ని డివిజన్లలో పలు అభివద్ధిపనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా పాలకపక్షం కార్పొరేషన్లో ప్రజల సమస్యలపై స్పందించి అభివద్ధిపై దృష్టి సారించాలని కొత్త కిశోర్ గౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.