Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.472 కోట్ల ప్రత్యేక నిధులతో మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి
- బీఆర్ఎస్ బడంగ్పేట్ మున్సిపల్ అధ్యక్షులు రాంరెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి చిగురింత పారిజాత నర్సింహారెడ్డికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి బిక్షని, గడిచిన మూడు సంవత్సరాల కాలంలో మంత్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివద్ధి పనుల కోసం రూ.472కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివద్ధికి చేయించారని బీఅర్ఎస్ కార్పొరేటర్ల త్యాగంతోనే మీరు మేయర్ గా కొనసాగుతున్నారని బీఅర్ఎస్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు అన్నారు. శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ల అభివద్ధి, సంక్షేమం కోసం ఎంతో కషి చేస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్‌గా గెలిచిన మీకు(పారిజాత నర్సింహారెడ్డి) మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేయర్ పదవి ఇవ్వటం జరిగిందన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో ఇంటి ట్యాక్సీలు అధికంగా ఉన్నాయనే విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు.ఏనాడు కౌన్సిల్ సమావేశంలో ఇంటి ట్యాక్సీలు అధికంగా ఉంటాయనే విషయం తమతో చర్చించలేదని తెలిపారు. మంత్రిని ఏక వచనంతో సంబోధించడం మీ విజ్ఞతకు వదలి వేస్తున్నామన్నారు. అధికార పార్టీలో మంత్రి గౌరవం ఇవ్వలేదని పార్టీ మారినట్టు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని, ఎమ్మెల్యే పదవి కాంక్షతోనే పార్టీ మారినట్లు విమర్శించారు. మంత్రి అభివద్ధిని అడ్డుకున్నారని చెప్పటం దురదష్టకరమన్నారు. మంత్రి కేటీఆర్ బడంగ్ పేట్ కు వచ్చిన సమయంలో అభివృద్ధి నిధుల కోసం కలవకుండా మంత్రి అడ్డుకున్నారని చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.కాల్వల నిర్మాణం కోసం మంత్రి ఎస్ఎన్డీపీ నిధులు మంజూరు చేయించారని,ఆ విషయం వక్రికరించి మున్సిపల్ నిధులతోనే అభివద్ధి పనులు చేశామనిజజ మంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేయించలేదని అంటున్నారన్నారు. మీరు చేసే వ్యవహారం మొత్తం తల్లి పాలు తాగి రొమ్ము పై కొట్టినట్టుగా ఉందన్నారు. అభివద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన శిలా ఫలకాలపై మొత్తం మున్సిపల్ సాదారణ నిధులే ఉంటాయని చెప్పటం ఏమిటని ఆ నిధులతో మంత్రికి సంబంధం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రి అహర్నిశలు కషి చేస్తున్నారని తెలిపారు. స్థాయిని మించి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వప్న జంగారెడ్డి,మమత కష్ణారెడ్డి, స్వప్న వెంకట్ రెడ్డి,దీపిక శేఖర్ రెడ్డి,లలిత కష్ణ,భారతమ్మ, అర్జున్,వై. రాంరెడ్డి, శివకుమార్, కో ఆప్షన్ సభ్యులు సమైక్య జ్యోతి అశోక్, రఘునందనా చారి, జగన్ మోహన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.