Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వల్ప ఆస్తి నష్టం
నవతెలంగాణ-ఉప్పల్
హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాద ఘటన వెలుగుచూసింది. ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్లై వుడ్ గోదాంలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మద్యాహ్నం 12 గంటల వరకు మూడు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. జిల్లా అగ్నిమాపక అధికారి దగ్గర ఉండి పర్యవేక్షణ చేశారు. ప్రమాదానికి కారణాలు అగ్నిమాపక సిబ్బంది కానీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానీ గోప్యంగా ఉంచారు. ఈ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి తే ఉండాల్సిన సంబంధిత పరికరాలు ఎలాంటివి లేవుని, ఈ పరిశ్రమకి అగ్నిమాపక అనుమతులు కూడా లేవని పరిశ్రమలోకి అడుగుపెట్టగానే అర్థం అవుతుంది. ఎలాంటి అగ్నిమాపక అనుమతులు లేకుండా ఒక ప్లైవుడ్ పరిశ్రమ నడపడం ఎలా సాధ్యం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందులోను చెక్కకు సంబంధించిన పరిశ్రమ కాబట్టి ముందస్తుగా అగ్నిమాపక పరికరాలు ఉండాలి కానీ ఎలాంటి పరికరాలు లేవు. ఉప్పల్ పారిశ్రామిక వాడలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కానీ అగ్నిమాపక అను మతులు లేకపోవడం గమనార్హం. జిల్లా అగ్నిమాపక అధి కారి నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ పరిశ్ర మకు అగ్నిమాపక అనుమతులు లేవని స్పష్టం అవుతోంది. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవించిందని సమాచారం.