Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో జోష్ క్రీడ ఈవెంట్
నవతెలంగాణ-బేగంపేట్
విధి నిర్వహణలో భాగంగా నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులు కొంత సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఆర్ఆర్సీ గ్రౌండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో నిర్వహించిన జోష్ క్రీడా ఈవెంట్‌ను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో పని చేస్తూ వివిధ హౌదాలలో ఉన్న ఉద్యో గులు తమ కుటుంబ సభ్యులతో ఒక వేదిక చేసుకొని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొ న్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మద్య స్నేహబంధాలు బలపడటమే కాకుండా పని ఒత్తిళ్ల నుంచి కొంత రిలీఫ్ పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు యాజమాన్యం ఈ విధమైన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల మంత్రి అభినందించారు. 2012 సంవ త్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహ కులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధులు బీవీ ఎస్ రావు, బద్రి విశాల్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన మార్కెట్ కమిటీ చైర్మెన్, డైరెక్టర్లు
బోయిన్పల్లి మార్కెట్ కమిటీ నూతన చైర్మెన్‌గా నియమితులైన రాగిరి హారిక ఆనంద్ బాబు, డైరెక్టర్లుగా నియమితులైన మాడిశెట్టి గిరిధర్, దేవులపల్లి శ్రీనివాస్, శ్రీరాముల ప్రభాకర్‌లు ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్ పల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.