Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ ప్రొఫెసర్ శ్రీరాములు కాప్రా
- సాయి సుధీర్ కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత
నవతెలంగాణ-కాప్రా
డిగ్రీ, పీజీ చదువుల పట్టాలతో విద్యార్థులు తమ జీవి తాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఉస్మాని యా యూని వర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డి.శ్రీరా ములు పేర్కొన్నారు. ఈసిఐఎల్లోని సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కళాశాల ప్రాంగణంలో సర్టిఫికెట్ల పంపిణీ(గ్రాడ్యుయేషన్ సెర్మనీ) ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీరాములు మాట్లాడుతూ ఎంబీఏ చదివిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లోమంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక లక్ష్య సాధనతో చదివే విద్యార్థులు సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తారని తెలి పారు. ఆకాడ మిక్ ఆడిట్ సెల్ జాయింట్ డైరక్టర్ ప్రొఫె సర్ జి. విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఉద్యోగం చేయడమే గాక సొంతంగా వ్యాపారం ఏర్పాటు చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే కోర్సు ఎంబీఏ అని అన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి. కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ ఆర్. ఉషారాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ మీరారాణి, డాక్టర్ ఎల్. పద్మా రాణి, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.