Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్ మాల్ భవనం మరో భాగం పూర్తిగా కుప్పకూలింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగ లేదు. జనవరి 19న దక్కన్మాల్లో అగ్ని ప్రమాదం జరిగి 14 గంటలపాటు మంట ల్లోనే భవనం ఉన్న విషయం విదితమే. అయితే భవనాన్ని కూల్చివేయాలని అధికారు లు ఒక నిర్ణయానికి వచ్చారు. మాలిక్ ట్రేడర్స్కు పనులు అప్పగించి కూల్చివేత పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం భవనం ఒక్కసారిగా కుప్పకూ లిపోయింది. అయితే ఇంకో 10 శాతం భవనం అలాగే ఉన్నట్టు తెలిసింది. మరో రెండు రోజుల్లో భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నారు.