Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీల బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలకు వెంటనే పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు విద్యా నగర్ బీసీ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లు వెంటనే ప్రవేశపెట్టి బీసీల బడ్జెట్ రూ. రెండు వేల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. పేదల కష్టంతో ఏర్పడిన బడ్జెట్ను కేంద్రం పెద్దలకు దోచిపెడుతూ నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు క్రిమిలేయర్ను వెంటనే తొలగించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించి ఫీజులు స్కాలర్ షిప్స్ ఇవ్వకుండా అన్యాయం చేస్తు న్నారని విమర్శించారు. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బీసీలకు ప్రతీ కుటుంబానికి రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. బీసీ లకు కేంద్ర బడ్జెట్ లో రూ. రెండు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జె ట్లో రూ. 20 వేల కోట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు భూపేష్ సాగర్, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్ కుమార్, అనంతయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.