Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్
నవతెలంగాణ-ఉప్పల్
చిలుకానగర్ డివిజన్లోని శ్రీనివాస హైట్స్ దగ్గర ఉప్పలకు వెళ్లే ప్రధాన రహదారిలో సివరేజీ పైప్ లైన్ మ్యాన్ హౌల్ ప్రమాదపుశాత్తు కూలిపోవడంతో, ఓవర్ ఫ్లూ అయ్యే సమస్యను గణేష్ నగర్ కాలనీ సభ్యుల ద్వారా తెలుసుకున్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ వెంటనే స్పందించారు. సమస్యను వెంటనే ఏఈ సత్యనారాయణ దష్టికి తీసుకువెళ్లి, ప్రత్యక్షంగా అధికారులతో పర్యవేక్షించి కూలిపోయిన మ్యాన్ హౌల్కు మరమ్మత్తులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి కౌకొండ జగన్, రామానుజన్, సివరేజీ వాటర్ బోర్డు సిబ్బంది ఉపేందర్ మొదలగువారు పాల్గొన్నారు.