Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి సీఐ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-మీర్పేట్
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు చాలా కీలకమని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మద్ది మహేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ సిద్దాల బీరప్ప ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం లక్ష్మీ నగర్ కాలనీ, ఆర్ఎన్ రెడ్డి నగర్ కాలనీలలో స్వంత ఖర్చుతో దాదాపు 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతీ కాలనీల్లో, ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన కార్పొరేటర్ సిద్దాల బీరప్పను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బాద్య నాయక్, గోవింద్ స్వామి, బీఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్, కాలనీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.