Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల్ తహసీల్దారు కె.గౌతమ్ కుమార్
నవతెలంగాణ-ఉప్పల్
జీఓ నం.59 దరఖాస్తుదారులు ఈ వారం రోజులు జరిగే ప్రత్యేక డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్ తహసీల్దారు కె.గౌతమ్ కుమార్ తెలిపారు. జీఓ నం.59 కింద భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో వారు డబ్బులు చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు చెప్పారు. గురువారం వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం జీఓ నెం.59కు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ నడుస్తున్నదన్నారు. ఈ డ్రైవ్‌లో దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నడుస్తుందన్నారు.ఉప్పల్ మండల పరిధిలో 221మంది లబ్దిదారులకు డిమాండ్ నోటీ సులు అందజేశామన్నారు. వీరిలో ఇప్పటికే 16 మంది డబ్బులు చెల్లించినట్టుగా తెలిపారు. లబ్దిదారులు రామంతాపూర్, ఉప్పల్ లోని సర్వే ఆఫ్ ఇండియా, మౌలాలి హౌసింగ్ బోర్డు, చైతన్య పురి లోని ప్రభుత్వ మీ సేవ కేంద్రాలలో మాత్రమే చలాన్లు తీసి తహసీల్దారు కార్యాలయంలో సమర్పిం చాల్సిందిగా కోరారు.