Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగుంటే సమాజంలో ప్రతీ ఒక్కరితో మాట్లాడే సామర్థ్యం ఉంటుం దని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి అన్నారు. రంగారెడ్డి న్యాయ సేవా ఆధ్వర్యంలో జాతీయ మహిళ కమిషన్ చేత మహిళలకు భద్రత, బాధ్య తలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గురువారం హయత్‌నగర్‌లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ సేవ అధికార సంస్థ రంగారెడ్డి జిల్లా రిసోర్స్ పర్సన్స్ అయిన్ శ్యామలాదేవి న్యాయవాది, సామాజికవేత్త అమితా రాణి, లాయర్‌ను నామినేట్ చేశారు. ఈ అవగాహన సదస్సు ద్వారా మహిళలకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు, యాసిడ్ ఎటాక్, వరకట్న వేధింపుల, లైంగిక వేధింపులు, పోక్సో చట్టం, మహిళల హక్కులు, కార్మికుల చట్టాలు, కుటుంబ చట్టాలు, జిల్లా న్యాయవాదికార సంస్థలు అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, ఉచిత లాయర్ గురించి వివరించారు. తదనంతరం జడ్జి మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఉచిత న్యాయ సహాయం, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా అంది స్తామని, ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలని అంగన్వాడి ఆశా వర్కర్లను కోరారు. ఈ కార్యక్రమానికి ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సీపీడీఓ వర్కర్లు, సఖి సెంటర్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, న్యాయ సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.