Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధీనగర్ డివిజన్లోని శ్రీ వారాల పోచమ్మ ఆలయం నుంచి జవహర్ స్కూల్ మెయిన్ రోడ్డు వరకు నూతన వీడీసీసీ రోడ్డు నిర్మాణం మంజూరుకు చర్యలు తీసుకుంటాం అని కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. శుక్రవారం టీఆర్టీ బస్తీ వాసులు కార్పొరేటర్‌ను కలిసి నూతన వీడీసీసీ రోడ్డు కోసం వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఉల్లిగడ్డ బస్తీ నుంచి శ్రీ వారాల పోచమ్మ గుడి వరకు కార్పొరేటర్ ప్రారంభించిన నూతన రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతుండటంతో స్థానికులు తదుపరి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను త్వరలో మంజూరు చేయించి పనులు మొదలు పెడతామని బస్తీవాసులకు కార్పొరేటర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు వినరు కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, సత్తి రెడ్డి, శ్రీనివాస్, నర్సింహ, అరుణ్ కుమార్, శివ కుమార్, స్థానిక బస్తీవాసులు దశరథ్, రవి, శివ కుమార్, కుసుమ, పాపమ్మ, తదితరుల పాల్గొన్నారు.