Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో నెలకొన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ పిలుపు ఇవ్వడంతో తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు ఉమర్ఖాన్ను తరలించారనీ, ఈ అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని దశలవారీగా అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా హక్కుల కోసం ఉద్యమిస్తే అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమనీ, ఎన్ని నిర్బంధాలు విధించినా అక్రమ కేసులు పెట్టినా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు.